Breaking News

మూడేళ్ళలో.. రెండు లక్షల మంది కొన్న కారు ఇది

Published on Tue, 03/11/2025 - 13:34

అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా అవతరించిన ఈ కారు.. ప్రీమియం ఫీచర్స్, కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

కియా ఇండియా.. కారెన్స్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే 36 నెలల్లో ఏకంగా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. కంపెనీ 70 కంటే ఎక్కువ దేశాల్లో 24064 యూనిట్ల కారెన్స్ కార్లను విక్రయించిందని స్పష్టం చేసింది.

మొత్తం అమ్మకాలలో కారెన్స్ పెట్రోల్ వేరియంట్‌లు 58 శాతం వాటాను కలిగి ఉండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ వెర్షన్‌ను ఎంచుకున్నారు. 32% కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్‌మిషన్‌లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్‌రూఫ్‌తో కూడిన వేరియంట్‌లను ఎంచుకున్నారు.

ఇదీ చదవండి: 48 గంటల్లో 20000 బుకింగ్స్.. మొదటి 50వేల మందికి..

కియా కారెన్స్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో, వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.

నెలవారీ (ఫిబ్రవరి) అమ్మకాల్లో సోనెట్ (7,598 యూనిట్లు), సెల్టోస్ (6,446 యూనిట్లు) మంచి వృద్ధిని సాధించాయి. కారెన్స్ గత నెలలో 5318 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం సేల్స్.. 2024 ఫిబ్రవరి కంటే 23.8 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తుంటే.. కియా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)