Breaking News

ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్‌షిప్‌

Published on Sat, 01/18/2025 - 08:22

భారతీయ క్రీడగా పేరొందిన ఖో-ఖోకు స్పాన్సర్‌షిప్‌ పెరుగుతోంది. ఈ ఆటను మరింత మందికి చేరువ చేసేందుకు కార్పొరేట్‌ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు లభించే దిశగా ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) పని చేస్తోంది. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖో-ఖోను చాలాకాలంగా దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఆడుతున్నారు. అయితే క్రికెట్ అంతటి ప్రజాదరణ పొందడంలో మాత్రం వెనకబడింది. ఈ పరిస్థితిని మార్చి ఖోఖోను ప్రపంచ వేదికలపై నిలబెట్టే ప్రయత్నాన్ని కేకేఎఫ్ఐ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ మరిన్ని స్పాన్సర్‌షిప్‌లకు కోసం చూస్తోంది.

ఖో-ఖో ప్రపంచకప్‌

కేకేఎఫ్ఐ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఖో-ఖో ప్రపంచకప్‌ను ఆవిష్కరించింది. జనవరి 13 నుంచి 19 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 23 దేశాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. ఏరియల్ డ్యాన్సర్లతో సహా ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు, స్టార్ పెర్ఫార్మర్ షిమాక్ దావర్ కొరియోగ్రఫీతో ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించారు.

స్పాన్సర్ షిప్‌లు

ఖో-ఖోను ఆధునీకరించడంలో భాగంగా కేకేఎఫ్ఐ క్రీడా ప్రాంగణాల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఇది మట్టి కోర్టుల్లో జరిగేది. దాన్ని ఇండోర్ మ్యాట్లపై జరిగేలా చేసింది. ఇది ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా మారింది. ఈ వాతావరణం స్పాన్సర్ షిప్‌లను కూడా ఆకర్షించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచకప్‌నకు ఈజ్ మై ట్రిప్, జీఎంఆర్‌ ఏరో, జొమాటో, బ్లాక్ బెర్రీస్, టాటా వంటి బ్రాండ్లు మద్దతు ఇస్తున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డీడీ స్పోర్ట్స్ వంటి ప్రధాన నెట్వర్క్‌ల్లో ఈ టోర్నమెంట్ ప్రసారం అవుతోంది. ఈ టోర్నమెంట్లకు 200 మిలియన్లకు పైగా వ్యూయర్‌షిప్‌ ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..

అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్‌

క్రికెట్‌లో ఐపీఎల్‌, కబడ్డీలో ప్రో కబడ్డీ లీగ్‌ ఎలాగో ఖో-ఖోలోనూ అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్‌ను 2022లో ప్రారంభించారు. ఇందులోనూ ఫ్రాంచైజీలుంటాయి. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ తరువాత దేశంలో అత్యధికంగా వీక్షించిన క్రికెటేతర క్రీడా టోర్నమెంట్‌గా యూకేకే ప్రజాదరణ పొందింది. లీగ్ మొదటి సీజన్‌లో 64 మిలియన్ల వ్యూయర్ షిప్‌ సొంతం చేసుకుంది.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)