Breaking News

మాకంటూ సొంత బాట

Published on Fri, 12/12/2025 - 08:39

దేశంలో మెజారిటీ నిపుణులు తమ కోసం తాము కష్టపడాలన్న అభిలాషతో ఉన్నారు. కృత్రిమ మేథ (ఏఐ), కొత్త నైపుణ్యాల పట్ల ఆసక్తి, ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ల మద్దతుతో వ్యాపారాన్ని ప్రారంభించి, దాన్ని విస్తరించుకోవడం సులభమన్న అభిప్రాయం లింక్డ్‌ఇన్‌ సర్వేలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి లింక్డ్‌ఇన్‌ ఒక నివేదికను విడుదల చేసింది. నిపుణుల లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్స్‌లో ‘ఫౌండర్‌’ (వ్యవస్థాపకుడు) అని జోడించినవి గత ఏడాది కాలంలో 104 శాతం పెరిగాయి. ప్రతి పది మందిలో ఏడుగురు నిపుణులు తమకోసం కష్టపడాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు పలు అంశాలు అనుకూలిస్తున్నట్టు లింక్డ్‌ఇన్‌ నివేదిక తెలిపింది.

  • చిన్న సంస్థల వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ ఒక భాగంగా మారిపోయింది.  

  • వ్యాపారాన్ని ప్రారంభించి, నిర్వహించడం సులభమని 82 శాతం మంది చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.  

  • వ్యాపార వృద్ధికి ఏఐని కీలకంగా 83 శాతం మంది పరిగణిస్తున్నారు. 11–200 మధ్య ఉద్యోగులు కలిగిన కంపెనీల్లో ఏఐపై అవగాహన 52 శాతం పెరిగింది.

  • 81 శాతం చిన్న, మధ్యస్థ వ్యాపార సంస్థలు ఏఐ సామర్థ్యాలపై పెట్టుబడులు పెడుతున్నాయి. 

భారత్‌ స్థానం ప్రత్యేకం..

‘‘భారత్‌లో చిన్న వ్యాపార సంస్థలు అసాధారణ వేగం, ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నాయి. ఏఐని వేగంగా స్వీకరించడం, నైపుణ్యాలను పెంచుకోవాలన్న అభిలాష, విశ్వసనీయమైన నిపుణుల నెట్‌వర్క్‌ల కలయిక భారత్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇవన్నీ కలసి వ్యాపారాన్ని ప్రారంభించడం, విస్తరించడం, విజయవంతం చేయడాన్ని పునర్‌నిర్మిస్తున్నాయి’’ అని లింక్డ్‌ఇన్‌ భారత్‌ మేనేజర్‌ కుమరేష్‌ పట్టాభిరామ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)