Breaking News

ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం

Published on Fri, 01/30/2026 - 09:12

భారత కార్యాలయ వసతుల లీజింగ్‌లో (ఆఫీస్‌ స్పేస్‌) అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతోంది. 2025లో దేశ వ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో 58 శాతం మేర ఆఫీస్‌ వసతులను అంతర్జాతీయ కంపెనీలే లీజింగ్‌కు తీసుకున్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది దేశవ్యాప్తంగా టాప్‌–7 నగారల్లో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగి 83.3 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) చేరింది. ఇందులో 48.6 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని అంతర్జాతీయ కంపెనీలు తీసుకున్నాయి. 2024లో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 77.2 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.

హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, కోల్‌కతా నగరాల్లోని లీజింగ్‌ను విశ్లేషించిన అనంతరం జేఎల్‌ఎల్‌ ఇండియా ఈ వివరాలు విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వ్యూహాత్మక వ్యాపార కేంద్రంగా భారత్‌ స్థానం మరోసారి రుజువైనట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌ నైపుణ్యాలున్న మానవ వనరుల లభ్యతకుతోడు ప్రముఖ నగరాల్లో అందుబాటు ధరలకే ప్రీమియం ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడుల దిశగా ఆకర్షిస్తున్నట్టు తెలిపింది.  

60 శాతం జీసీసీల్లోనే..

అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో గేతడాది 48.6 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ వసతులను అద్దెకు తీసుకుంటే.. అందులో 31.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల్లోనే (జీసీసీలు) ఉండడం గమనార్హం. 7 నగరాల్లో గతేడాది మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో దేశీ సంస్థలు 34.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని లీజుకు తీసుకున్నాయి. అంతర్జాతీయ సంస్థల వ్యాపార విస్తరణకు బెంగళూరు అత్యంత ప్రాధాన్య నగరంగా ఉంది. భారత ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ మార్కెట్‌లో జీసీసీలు ప్రముఖ శక్తిగా ఉన్నట్టు జేఎల్‌ఎల్‌ భారత ఎండీ రాహుల్‌ అరోరా పేర్కొన్నారు. గతేడాది ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో కోవర్కింగ్‌ ఆపరేటర్లు కూడా కీలక పాత్ర పోషించినట్టు జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది. భవిష్యత్‌కు వీలైన పని ప్రదేశాలుగా, నిపుణుల లభ్యత, నిర్వహణ సౌలభ్యంతో జీసీసీలు కీలకంగా మారినట్టు భైవ్‌ వర్క్‌స్పేస్‌ సీఈవో శేష్‌ రావు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

Videos

CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం

Donald : ఆయన భార్య అందగత్తె.. అందుకే పదవి ఇచ్చా!

Vidadala: పోలీసులకు ముడుపులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పేకాటలు

Chitoor: స్కూల్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ 30 మంది విద్యార్థులకు గాయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ

Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?

దేవుడితో పెట్టుకొని మహా పాపం చేశారు బాబును బోనులో నిలబెట్టాల్సిందే!

రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Tirumala Laddu: బయటపడ్డ బాబు భోలే బాబా డెయిరీ రహస్యం ఇవిగో ఆధారాలు

Photos

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)

+5

పారిస్ వీధుల్లో సందడిగా హీరోయిన్ 'స్నేహ' ఫ్యామిలీ (ఫోటోలు)

+5

ఉయ్యూరు : నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం (ఫొటోలు)

+5

బేగంపేటలో ఆకట్టుకుంటున్న వింగ్స్‌ ఇండియా ప్రదర్శన (ఫొటోలు)

+5

రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)