Breaking News

వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు ఇవేనా..

Published on Thu, 02/05/2026 - 09:43

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రేషన్, ఆడిట్, రిఫండ్ ప్రక్రియలను భారీగా సరళీకరించేందుకు సిద్ధమవుతోంది. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

గత ఏడాది సెప్టెంబర్ 3న జరిగిన సమావేశం తర్వాత, ప్రస్తుత బడ్జెట్ ఆమోద ప్రక్రియ ముగిశాక ఈ కీలక భేటీ జరగనుంది. వచ్చే నెలలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల స్థాయిలో రెండు విడతలుగా చర్చలు పూర్తికాగా ప్రాథమిక అజెండా సిద్ధమైంది.

రిఫండ్లలో ఇబ్బందుల తొలగింపు

ప్రస్తుతం వస్తువులు, సర్వీసులకు మధ్య ఉన్న విభజన కారణంగా సేవల రంగంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) రిఫండ్లు పొందడంలో వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ నిలిచిపోతోంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్లు అంటే.. ఒక వ్యాపారి తన బిజినెస్‌ కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన పన్నును, తిరిగి ప్రభుత్వం నుంచి వెనక్కి పొందడం లేదా తదుపరి పన్ను చెల్లింపుల్లో తగ్గించుకోవడం.

ఈ నేపథ్యంలో సర్వీసులపై పేరుకుపోయిన ఐటీసీ రిఫండ్‌లను సులభతరం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వ్యాపారాల్లో నగదు లభ్యత పెరిగి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.

ప్రభుత్వ విధానం ఇదే..

బడ్జెట్, ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించిన కొత్త నిబంధనలు ‘పన్ను చెల్లింపుదారులపై నమ్మకం’ అనే సూత్రంపై ఆధారపడి ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే సవరించిన రిటర్న్‌ల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. వీటి ప్రకారం..

  • సెక్షన్ 148 కింద నోటీసు వచ్చినా వివాదాస్పద పన్ను, వడ్డీ చెల్లించి రిటర్న్‌లను అప్‌డేట్ చేస్తే ఆ ప్రక్రియను అక్కడితోనే ముగించే అవకాశం ఉంది.

  • ఆడిట్ పరిధిలోకి రానివారు ఏడాదిలోపు సవరించిన రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే డిసెంబర్ 31 తర్వాత దాఖలు చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

  • గతంలో రిటర్న్‌లు దాఖలు చేయకపోయినా సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసిన నాలుగేళ్ల వరకు అప్‌డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు.

జరిమానాల నుంచి మినహాయింపు

ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 440 కింద రక్షణ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయాన్ని తప్పుగా నివేదించిన సందర్భాల్లో నిర్దేశిత అదనపు పన్ను చెల్లిస్తే భారీ జరిమానాల నుంచి మినహాయింపు పొందే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించనుంది. ‘నిబంధనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని అమలు చేయడమే తదుపరి అంశం. అధికారులపై పనిభారం పెరిగినప్పటికీ పన్ను చెల్లింపుదారులకు మేలు చేయడమే మా ప్రాధాన్యత’ అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు.

ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)