Breaking News

మనసు లేని బ్యాంకులు! కేరళ ప్రభుత్వం అసంతృప్తి

Published on Mon, 08/19/2024 - 18:15

కేరళలో వయనాడ్‌ విపత్తు బాధితుల పట్ల బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై కేరళ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాధితుల ఖాతాల నుంచి రుణాల ఈఎంఐలను కట్‌ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ రుణాలను బ్యాంకులు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేసింది.

ఈ రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు భరించలేని నష్టమేమీ వాటిల్లదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం విజయన్ మాట్లాడుతూ.. బాధితుల వడ్డీ మొత్తాలలో సడలింపు లేదా నెలవారీ వాయిదాలను చెల్లించడానికి సమయాన్ని పొడిగించడం పూర్తి పరిష్కారం కాదన్నారు.

గత జులై 30న జరిగిన భయానక దుర్ఘటన ప్రభావాన్ని, మిగిల్చిన శోకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విపత్తులో 200 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది చనిపోయారని, విపత్తు కారణంగా వారి భూమి నిరుపయోగంగా మారిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకున్న వారు ఇంటినే పోగొట్టుకున్నారని తెలిపారు. అలాంటి వారు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. బాధితులు తీసుకున్న మొత్తం రుణాలను మాఫీ చేయడమే మన చేయగల మేలు అని సీఎం విజయన్ సూచించారు.

సాధారణంగా బ్యాంకులు మాఫీ చేసిన మొత్తానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం చెల్లించాలని ఆశిస్తాయనీ, అయితే ఈ సమస్యపై అలాంటి వైఖరి తీసుకోవద్దని సీఎం విజయన్ అన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు సొంతంగా భరించాలని ఆయన కోరారు.  కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన కొందరి ఖాతాల నుంచి ఈఎంఐలు కట్‌ చేసిన కేరళ గ్రామీణ బ్యాంకుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో యాంత్రికంగా ఉండకూడదన్నారు.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు