ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్‌.. కర్ణాటక సంచలన నిర్ణయం

Published on Wed, 08/14/2024 - 20:24

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ బ్యాంకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఖాతాలను మూసివేయాలని బుధవారం అన్ని శాఖలను ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు, పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఈ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులు కూడా పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఆయా బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అవకతవకలు, అనధికార లావాదేవీలు జరిగినట్లు రోపణలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఖాతాలను మూసివేయాలనే నిర్ణయానికి దారితీసిందని ప్రభుత్వం తెలిపింది. రూ.187 కోట్ల కార్పొరేషన్‌ నిధులకు సంబంధించి అనధికార లావాదేవీలు జరిగిందని, ఇందులో రూ.88.62 కోట్లు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్‌లోని సహకార బ్యాంకుకి బదిలీ అయినట్లు తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)