Breaking News

ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కార్మిక శాఖ అధికారుల విచారణ

Published on Fri, 02/14/2025 - 09:59

కర్ణాటక కార్మిక శాఖ అధికారులు బెంగళూరు, మైసూరులోని ఇన్ఫోసిస్(Infosys) క్యాంపస్‌లను సందర్శించారు. ఇటీవల కంపెనీ ఉద్యోగులను భారీగా తొలగించిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం నియమితులైన సుమారు 700 మంది ట్రెయినీలను ఇన్ఫోసిస్ తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ఆరోపించింది. అయితే, సంస్థ మూడుసార్లు నిర్వహించిన ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో సదరు ఉద్యోగులు ఉత్తీర్ణత సాధించలేదని ఇన్ఫోసిస్‌ తెలిపింది. దాంతో నిబంధనలకు అనుగుణంగానే వారు రాజీనామా చేసినట్లు చెప్పింది. ఈ ఉద్యోగుల సంఖ్య కూడా 350 మాత్రేమేనని కంపెనీ వాదిస్తోంది.

ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, తదనుగుణంగా ఫిర్యాదుదారులకు వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దాంతో ఇటీవల అధికారులు స్థానిక క్యాంపస్‌లను సందర్శించి విచారణ జరిపారు.

స్నేహపూర్వక విధానాలు..

కంపెనీపై వస్తోన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఇన్ఫోసిస్ ఉద్యోగుల స్నేహపూర్వక విధానాలకు కట్టుబడి ఉందని నొక్కి చెప్పింది. నియామక ఒప్పందాలకు అనుగుణంగానే తొలగింపులు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు, ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైతే కలిగే పరిణామాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నట్లు చెప్పింది. దానివల్లే కొందరికి లేఆఫ్స్‌ అనివార్యం అయ్యాయని స్పష్టం చేసింది. తమ ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరును నిర్ధారించడానికి ఈ చర్యలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: శ్రీలంక పవర్‌ ప్రాజెక్టుల నుంచి అదానీ బయటకు

స్పష్టత కోసం ఎదురుచూపులు

ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడం, ఇన్ఫోసిస్ అమలు చేస్తున్న చర్యలు కార్మిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కర్ణాటక కార్మిక శాఖ దర్యాప్తు లక్ష్యం. దర్యాప్తు కొనసాగుతుండటంతో ఇన్ఫోసిస్ బాధిత ఉద్యోగులు ఈ విషయంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ పరిశ్రమలో ఉద్యోగుల సంక్షేమం-కార్పొరేట్ విధానాలను సమతుల్యం చేయడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Videos

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)