Breaking News

రెండో స్థానానికి కర్ణాటక

Published on Fri, 11/22/2024 - 12:21

భారతదేశంలో కర్ణాటక రెండో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్‌), మాండ్య జిల్లా సహకార మిల్క్ యూనియన్‌లు సంయుక్తంగా కొత్త నందిని పాల ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడారు. దేశంలో పాల ఉత్పత్తిలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉంది.

డెయిరీ రంగానికి రాష్ట్రం అపార మద్దతు ఇవ్వడంతోనే ఈ విజయం సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు. పాడి పరిశ్రమను పెంపొందించడంలో, పాల ఉత్పత్తిదారులకు సరసమైన ధర కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కర్ణాటక ప్రస్తుతం రోజుకు 92-93 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు 2.5 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ‘క్షీరధారే పథకం’ ద్వారా, పాలను లీటరుకు రూ.32 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదనంగా లీటరుకు రూ.5 ప్రోత్సాహకాన్ని అందజేస్తోంది.

ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!

స్టాక్‌ మార్కెట్‌లో పాల ఆధారిత ఉత్పత్తులను అందించే కంపెనీలకు కర్ణాటక రాష్ట్రంలోని మిల్క్‌ యూనియన్ల సహకారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ పాలతోనే విభిన్న ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలియజేస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయి, పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్న కొన్ని కంపెనీలు కింద తెలియజేస్తున్నాం.

  • పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్: గోవర్ధన్ అండ్‌ గో బ్రాండ్లకు ప్రసిద్ధి.

  • దొడ్ల డెయిరీ లిమిటెడ్: పాల ఉత్పత్తుల తయారీ, పంపిణీలో దొడ్లా డెయిరీ దక్షిణ భారతదేశంలో బిజినెస్‌ చేస్తోంది.

  • హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్: హట్సన్, అరుణ్, ఆరోక్య వంటి బ్రాండ్లను ఇది నిర్వహిస్తోంది.

  • హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్: ఈ సంస్థ ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

  • వాడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: ఐస్ క్రీములకు ఇది ప్రసిద్ధి. వాడిలాల్ పాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)