Breaking News

‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు

Published on Wed, 05/10/2023 - 16:38

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌  సందర్భంగా ఇన్ఫోసిస్‌  కో-ఫౌండర్‌ నారాయణ మూర్తి, ఆయన సతీమణి, రచయిత్రి సుధామూర్తి విశేషంగా నిలిచారు. ఎందుకుంటే పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే పోలింగ్ బూత్‌కొచ్చి  క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు.  ఈ సందర్భంగా నారాయణమూర్తి దంపతులు ఓటు హక్కు వినియోగంపై యువతకు సందేశమిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. 

బెంగళూరులోని జయనగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. ఓటు హక్కను వినియోగించుకోకపోతే, ఆ తరువాత పాలకులను ప్రశ్నించే హక్కునుకూడా కోల్పోతామని సుధామూర్తి వ్యాఖ్యానించారు. తాము పెద్దవాళ్ల మైనప్పటికీ ఉదయమే ఓటు హక్కును వినియోగించు కున్నామనీ, తమ నుంచి యువత నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పద్మభూషణ్  అవార్డీ మీడియాతో మాట్లాడుతూ ‘‘దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి.  ప్రజాస్వామ్యంలో  ఓటు పవిత్రమైన భాగం" అన్నారు.

 ఈ  సందర్బంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ఓటు  ప్రాధాన్యత గురించి యువతకు చెప్పాల్సిన బాధ్యత పెద్దలదే. తన  తల్లిదండ్రులు తనకు అలాగే చెప్పారని చెప్పారు.  తాను విదేశాల నుంచి ఈరోజు ఉదయం తిరిగొచ్చాననీ, అయినా ఓటు వేసేందుకు వచ్చానని  నారామణ మూర్తి తెలిపారు ఫస్ట్‌ ఓటు వేద్దాం.. ఆ తరువాతే ఇది బాగాలేదు.. అది బాగాలేదు అనే చెప్పవచ్చు లేదంటే.. విమర్శించే హక్కు  ఉండదనిపేర్కొన్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని కోరమంగళలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.

కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలు తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార బీజేపీకి,  అటు కాంగ్రెస్‌కు చాలా  కీలకం. కర్నాటక లోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)