ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్స్‌కు ఉద్యోగాలివ్వని జెరోధా.. కారణం చెప్పిన కామత్‌

Published on Fri, 01/19/2024 - 13:05

ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధాలో ఉద్యోగాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థలో ఐఐటీ, ఐఐఎంలో చదివినవారిని ఎందుకు నియమించుకోలేదని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ తోమర్‌తో జరిపిన సంభాషణలో కామత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

జెరోధా కంపెనీలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు ఎందుకు లేరనే ప్రశ్నకు స్పందిస్తూ ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను నియమించుకోకూడదనే నిబంధనేమీ సంస్థలో లేదని కామత్‌ స్పష్టం చేశారు. అయితే కంపెనీలో వారిని నియమించుకుని జీతభత్యాలు చెల్లించేంత డబ్బు లేదని తెలిపారు. చదువు అయిపోయాక వారు భారీ జీతాలు ఆశిస్తారని పేర్కొన్నారు.

చాలామంది విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థికంగా తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నట్లు కామత్‌ చెప్పారు. అయితే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని రానున్న రెండేళ్లు, ఐదేళ్లు.. అలా ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ వెళ్తే విజయం దానంతటదే వస్తుందని చెప్పారు.  

ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..!

డేట్రేడింగ్‌ చాలా ప్రమాదకరమని కామత్‌ అన్నారు. దీర్ఘకాల పెట్టుబడితో మంచి రాబడులు పొందవచ్చని చెప్పారు. కంపెనీలు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్‌ ఫండ్‌..వంటి మంచి లాభాలు తీసుకొచ్చే ఎన్నోమార్గాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)