Breaking News

పెయింటర్స్‌కు గుర్తింపు ఇస్తున్న ప్రోగ్రామ్‌..

Published on Tue, 06/03/2025 - 10:49

ప్రతి మనిషి తన జీవితాన్ని రంగులమయం చేసుకోవాలనుకుంటారు. అందుకు సరైన అవకాశం రావాలి. అయితే అలాంటి అవకాశాలు వాటంతటవే వస్తాయని కూర్చుంటే మాత్రం ఎప్పటికీ విజయం వరించదు. జీవితంలో కెరియర్‌ పరంగా ఎదిగేందుకు వచ్చే ప్రతి మలుపును అవకాశంగా మలుచుకోవాల్సిందే. వివిధ రంగులను కలబోసి ప్రత్యేక రంగులు సృష్టించేవారికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. అందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పెయింటర్లకు శిక్షణ ఇస్తున్నాయి. వాటిని తన జీవితంలో ఎదిగేందుకు అవకాశంగా మలుచుకున్నవారిలో విశాఖపట్నానికి చెందిన గణిరాజు సిరిపురం ఉన్నారు. అందుకు ప్రముఖ పెయింట్‌ కంపెనీ ఏషియన్‌ పెయింట్స్‌ అందించిన ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. 

ఏషియన్‌ పెయింట్స్‌ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా చాలా మందికి శిక్షణ ఇస్తోంది. ఇందులో రంగుల కలయికతో ప్రదేశానికి తగినట్లుగా, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి రంగులు తయారు చేయాలో, ఎలాంటి డిజైన్‌లను ఇష్టపడుతున్నారో వంటి అంశాలను తెలియజేస్తూ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గణిరాజు సిరిపురం ‘కామ్యాబీ కే రంగ్’ సీజన్ 6లో ప్రతిభ కనబరిచారు.

పాఠాలు నేర్చుకున్నారు.. జీవితాలు మార్చుకున్నారు..

గణిరాజు ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కంపెనీ తెలిపింది. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా పాఠాలు నేర్చుకొని తమ జీవితాలను మార్చుకున్న కాంట్రాక్టర్ల స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. సీజన్‌ 6లో గణిరాజు ప్రతిభ కనబరిచినట్లు తెలిపింది. ఇప్పటివరకు వివిధ సీజన్‌ల్లో ఢిల్లీకి చెందిన జునైద్ కాజ్మీ, గుజరాత్‌లోని మధపార్‌కు చెందిన అమృత్ బెన్, వారణాసి నుంచి బంటి బింద్ ముందువరుసలో ఉన్నారని చెప్పింది.

కుటుంబ పోషణకు పెయింటింగ్‌ వైపు

ఏషియన్ పెయింట్స్ ప్లాట్‌ఫాం ద్వారా సంస్థ లక్షల మందికి ప్రేరణ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వారిలో విశాఖపట్నం‌కు చెందిన గణిరాజు సిరిపురం ఒకరు. పట్టుదలతో తన జీవితాన్ని విజయగాథగా మార్చుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఎక్కువ. కానీ పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి బాధపడుతున్న తండ్రిని చూసి తన కలలను పక్కన పెట్టారు. కుటుంబాన్ని ఆదుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో కుటుంబ పోషణ కోసం పెయింటింగ్ వేసేవారు. ఈ క్రమంలో వైవిధ్యంగా పెయింటింగ్‌ వేస్తూ తానకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.

పని పట్ల గౌరవం.. జీవితంపై స్పష్టత..

కాలక్రమేణా కస్టమర్ల అంచనాలు పెరుగుతున్న కొద్దీ తనను  తాను మెరుగుపరచుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ గురించి తెలుసుకున్నారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ పొందారు. ఈ శిక్షణతో తనలో ఆత్మవిశ్వాసంతో పాటు పని పట్ల గౌరవం, జీవితంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో మెలకువలు నేర్చుకుని వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు గణిరాజు కేవలం పెయింటర్ మాత్రమే కాదు. ఒక కళాకారుడిగా తన కెరియర్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన పనికి ఒక గుర్తింపు ఉంది. ఈ వృత్తిలో ఆయన నైపుణ్యం కలిగిన వ్యక్తిగా స్థిరపడ్డారు. సరైన అవకాశం దొరికితే ఎటువంటి కష్టం వచ్చినా జీవితాన్ని రంగులమయం చేసుకోవచ్చని తన కథ చెబుతోంది.

ఇదీ చదవండి: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఎంతో మందికి స్ఫూర్తిదాయకం

ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింగిల్ మాట్లాడుతూ ‘కామ్యాబీ కే రంగ్‌ అనేది సాధారణ క్యాంపెయిన్ మాత్రమే కాదు. వ్యక్తుల విజయాలను స్మరించుకునే ఒక ఉత్సవం. సాధారణ జీవితం సాగించే పెయింటర్లు కంపెనీ ప్రోగ్రామ్‌ ద్వారా సమాజంలో ఎదగడం చూస్తున్నాం. ఈ ప్రయాణం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటివరకు 21 లక్షలకు పైగా ట్రైనింగ్ సెషన్లు నిర్వహించింది. ఈ శిక్షణలోని పెయింట్ అప్లికేషన్, వాటర్‌ప్రూఫింగ్, ఉడ్‌ ఫినిషెస్, మెషినరీ వాడకం, కస్టమర్ సర్వీస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్ని 79 శాతం మంది తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. 88 శాతం మంది తమ పనిలో మెరుగయ్యారు. 86 శాతం మందికి సామాజిక గౌరవం లభించింది’ అన్నారు.

#

Tags : 1

Videos

YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు

ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో

హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!

ఆంధ్రా కిమ్ నారా లోకేష్

పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!

మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు

ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు

పొట్టు పొట్టు కొట్టుకున్న ఇప్పటం జనసేన నేతలు

శభాష్ ఇస్రో.. YS జగన్ ప్రశంసలు

శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)

+5

#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)

+5

మహేష్‌ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్‌

+5

అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్‌ కమెడియన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైఎస్ జగన్‌ ప్రజాదర్బార్‌: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)

+5

నా సూపర్‌స్టార్‌: భార్యకు సంజూ శాంసన్‌ విషెస్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీతారలు (ఫొటోలు)