Breaking News

జులైలో ఎగుమతులు జూమ్‌

Published on Fri, 08/15/2025 - 04:39

న్యూఢిల్లీ: ఎగుమతులు రెండు వరుస నెలల క్షీణత తర్వాత జూలైలో పుంజుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 7.29% వృద్ధితో 37.24 బిలియన్‌ డాలర్ల విలువైన (రూ.3.24 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. దిగుమతులు సైతం 8.6% పెరిగి 64.59 బిలియన్‌ డాలర్ల (రూ.5.62 లక్షల కోట్లు)కు చేరాయి. దీంతో వాణిజ్య లోటు ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరి, 27.35 బిలియన్‌ డాలర్లుగా (రూ.2.38 లక్షల కోట్లు) నమోదైంది. 

గతేడాది నవంబర్‌ (31.77 బిలియన్‌ డాలర్లు) తర్వాత ఇదే గరిష్ట వాణిజ్య లోటు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3% పెరిగి 149.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు 5%కి పైగా పెరిగి 244 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

వాణిజ్య లోటు 4 నెలల్లో 94.81 బిలి యన్‌ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భత్వాల్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఎగుమతులే ఎక్కువ వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్, రత్నాభరణాలు, ఫార్మా, కెమికల్స్‌ ఎగుమతుల్లో బలమైన పనితీరు చూపాయి.

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి