Breaking News

పిజ్జా కంపెనీలో రూ. 1801 కోట్ల షేర్లు అమ్మేసిన ప్రమోటర్లు

Published on Sat, 06/14/2025 - 17:57

జూబిలెంట్‌ గ్రూప్‌ కంపెనీల్లో ప్రమోటర్లు గణనీయంగా వాటాలు విక్రయించారు. జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ (జేఎఫ్‌ఎల్‌), జూబిలెంట్‌ ఇన్‌గ్రేవియా, జూబిలెంట్‌ ఫార్మోవాలో రూ. 1,801 కోట్ల విలువ చేసే వాటాలను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా అమ్మేశారు.

ఎన్‌ఎస్‌ఈలోని బ్లాక్‌ డీల్స్‌ డేటా ప్రకారం జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ ప్రమోటర్‌ అయిన జూబిలెంట్‌ కన్జూమర్‌ 1.06 కోట్ల ఈక్విటీ షేర్లను (1.61 శాతం వాటా) విక్రయించింది. అలాగే, జూబిలెంట్‌ ఇన్‌గ్రేవియా ప్రమోటింగ్‌ సంస్థలు (జూబిలెంట్‌ ఎన్‌ప్రో, నికిత రిసోర్సెస్, శ్యామ్‌ సుందర్‌ భార్తియా ఫ్యామిలీ ట్రస్ట్‌) 98.65 లక్షల షేర్లు (6.2 శాతం వాటా) విక్రయించాయి.

అలాగే జూబిలెంట్‌ ఫార్మోవా ప్రమోటర్‌ సంస్థలు జూబిలెంట్‌ ఎన్‌ప్రో, నికిత రిసోర్సెస్‌ 32.86 లక్షల షేర్లను (2.06 శాతం వాటా) విక్రయించాయి. ఈ షేర్లను సగటున రూ. 662–1,060.37 రేటుకు అమ్మడంతో మొత్తం అన్ని లావాదేవీల విలువ కలిపి రూ. 1,800.98 కోట్లుగా నమోదైంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)