జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు

Published on Sun, 12/21/2025 - 14:30

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్‌ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా, బీఎమ్‌డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే.  అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ కూడా తమ బైక్‌ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు.

భారత్‌లో తయారు చేసే జీ 310 ఆర్‌ఆర్, సీఈ 02 బైక్‌లతో పాటు ఎఫ్‌ 900 జీఎస్, ఎఫ్‌ 900 జీఎస్‌ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్‌లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)