Breaking News

Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ ఆస్తుల విలువ అక్షరాలా..!

Published on Tue, 03/14/2023 - 10:11

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అభిమానులు కలిగి ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్‌. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమై 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా మారి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ రోజు దక్షిణాది చిత్ర సీమలో ఎక్కువ సంపాదిస్తున్న నటులలో ఈయన ఒకరు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌ మొత్తం ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 571 కోట్లు. ఈయన నెలకు రూ. 3 కోట్లు వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు తీసుకునే వారని, ఆర్ఆర్ఆర్ మూవీకి 45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కూడా సంపాదిస్తారు. ఇతర హీరోలతో పోలిస్తే అలాంటి సంపాదన ఎన్టీఆర్‌కి కొంత తక్కువనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తరువాత ఇప్పుడు తన రెమ్యునరేషన్ రూ. 60 నుంచి 80 కోట్లకు పెంచారు.

టాలీవుడ్‌లో యంగ్ టైగర్‌గా పిలువబడే Jr NTR హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ. 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబముతో కలిసి నివసిస్తున్నారు. బెంగళూరులో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా హైదరాబాద్ శివార్లలోని గోపాలపురంలో 'బృందావనం' అనే ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ కారుని కలిగి ఉన్నారు. అంతే కాకుండా రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే 718 కేమాన్, బిఎండబ్ల్యు 720LD, మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 250డి, 4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే ఎఫ్1తో పాటు ఖరీదైన వాచీలు, సుమారు రూ. 8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ కూడా కలిగి ఉన్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు