Breaking News

ఉద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న జేపీ మోర్గాన్.. అదేంటంటే?

Published on Mon, 10/09/2023 - 21:02

ఇజ్రాయెల్‌ - హమాస్ వార్ కారణంగా అక్కడి వాతావరణం భీకర దాడులతో భయానకంగా ఉంది. ఈ సందర్భంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం 'జేపీ మోర్గాన్ చేజ్' (JP Morgan Chase) తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇజ్రాయెల్‌లోని తన సిబ్బందిని పరిస్థితులు చక్కబడే వరకు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాల్సిందిగా కోరింది. పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ చేసిన ఆకస్మిక దాడి రెండు వైపుల హింసాత్మక సంఘర్షణకు దారితీసింది.

ప్రస్తుతం ఇజ్రాయెల్, మిలిమెంట్ గ్రూపుల మధ్య జరుగుతున్న దాడుల్లో ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించే అవకాశం లేదు. కావున సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్‌వాలా..!!

ఇజ్రాయెల్‌లో జేపీ మోర్గాన్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులను ప్రపంచంలోని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంలో వందల మందికిపైగా మరణించినట్లు, మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. రానున్న రోజులు మరింత భయానకంగా ఉండే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)