Breaking News

మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం

Published on Fri, 09/13/2024 - 07:07

న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల పట్ల బలమైన ధోరణితో ఉన్నట్టు మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ‘ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే క్యూ4, 2024’ నివేదిక వెల్లడించింది. 37 శాతం భారత కంపెనీలు వచ్చే మూడు నెలల్లో (అక్టోబర్‌–డిసెంబర్‌) నికరంగా తమ సిబ్బందిని పెంచుకోనున్నట్టు ఈ సర్వేలో తెలిపాయి. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం అధికం. క్రితం ఏడాది అక్టోబర్‌ - డిసెంబర్‌తో పోల్చి చూస్తే తటస్థంగా ఉంది.

వివిధ రంగాల్లోని 3,150 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ తెలుసుకుంది. భారత్‌ తర్వాత కోస్టారికాలో అత్యధికంగా 36 శాతం కంపెనీలు, ఆ తర్వాత యూఎస్‌లో 34 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి. సిబ్బందిని తగ్గించుకునే కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నికర నియామకాల గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.

‘‘నియామకాల ఉద్దేశ్యం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల ధోరణిని తెలియజేస్తోంది. విదేశీ విధానాలు, పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి తోడు మనకున్న అధిక యువ జనాభా సానుకూలతలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని పెంచుతాయి’’అని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ సందీప్‌ గులాటి పేర్కొన్నారు.  

రంగాల వారీగా..
మ్యానపవర్‌ గ్రూప్‌ సర్వే ప్రకారం.. దాదాపు అన్ని రంగాల్లోనూ నియామకాల పట్ల సానుకూలత వ్యక్తమైంది. ఫైనాన్షియల్, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో వచ్చే మూడు నెలల్లో 47 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉంటే, ఐటీలో 46 శాతం, ఇండ్రస్టియల్స్, మెటీరియల్స్‌రంగాల్లో 36 శాతం, కన్జ్యూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ రంగాల్లో 35 శాతం కంపెనీలు సిబ్బందిని పెంచుకోవాలని అనుకుంటున్నాయి. అతి తక్కువగా కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ రంగాలో 28 శాతం కంపెనీలే వచ్చే మూడు నెలల్లోనియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: 6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా    

ఉత్తరాదిలో ఉద్యోగాల డిమాండ్‌ 41 శాతంగా ఉంటే, పశ్చిమాదిన 39 శాతంగా ఉంది. అధిక దేశీయ వినియోగం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పథకాలు, ఔట్‌సోర్స్‌ సేవల డిమాండ్‌ పెంచడం, తయారీపై భారత్‌ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నట్టు గులాటి తెలిపారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. భారత్‌ నిరుద్యోగాన్ని తగ్గించి, కొత్త తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయొచ్చని గులాటీ వివరించారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)