Breaking News

జియో ట్యాగ్ 2 వచ్చేసింది: దీని గురించి తెలుసా?

Published on Sun, 08/02/2026 - 20:09

సాధారణంగా కొన్నిసార్లు వస్తువులు (తాళం, బ్యాగ్, పర్స్) ఎక్కడపెట్టామో మర్చిపోతూ ఉంటాము. అత్యవసర సమయంలో అవి ఎక్కడున్నాయో వెతుక్కోవడానికి సమయం కూడా సరిపోదు. అలాంటి కష్టానికి చెక్ పెట్టడానికి జియో కొత్త ట్రాకర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. జియో ట్యాగ్ 2 పేరుతో వచ్చిన ఈ కొత్త డివైజ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

గతంలో జియో తీసుకొచ్చిన జియో ట్యాగ్ డివైజ్‌కు కొనసాగింపుగా.. వచ్చిన ఈ కొత్త వెర్షన్‌లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఈసారి జియో ట్యాగ్ 2ను ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండు రకాల ఫోన్లతోనూ ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ఈ గ్యాడ్జెట్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు.

జియో ట్యాగ్ 2 ధర
భారత మార్కెట్‌లో జియో ట్యాగ్ 2 ధర రూ.1,249గా నిర్ణయించారు. ఇది మూడు (బ్లాక్, రెడ్, గ్రీన్) రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని డిజైన్ కూడా కొంత మార్చేశారు. పాత వెర్షన్‌తో పోలిస్తే ఇది.. కొత్త ఆకారంలో కనిపిస్తుంది. ప్రస్తుతం దీన్ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లతో రూ.50 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. దీంతో ధర రూ.1,199కి చేరుతుంది.

జియో ట్యాగ్ 2లో వచ్చిన అతిపెద్ద అప్‌గ్రేడ్ క్రాస్ ప్లాట్‌ఫామ్ సపోర్ట్. అంటే ఇంతకుముందు కొన్ని పరిమితులు ఉండగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లు రెండింటిలోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ చిన్న డివైజ్‌ను బ్యాగులు, కీలు, పర్సులు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులకు అమర్చుకోవచ్చు. బ్లూటూత్ సహాయంతో సమీపంలో ఉన్న వస్తువులను సులభంగా గుర్తించవచ్చు. ఇందులో 120dB శబ్దం చేసే బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంటుంది. వస్తువు దగ్గరలో ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేసి దాన్ని త్వరగా కనుగొనవచ్చు.

ఒకవేళ వస్తువు బ్లూటూత్ పరిధిని దాటిపోయినా.. లొకేషన్ ట్రాకింగ్ కోసం నెట్‌వర్క్ ఆధారిత సేవలను ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ ఫైండ్ హబ్, యాపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీంతో వస్తువు ఉన్న ప్రదేశాన్ని మ్యాప్‌లో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిస్థాయి లైవ్ ట్రాకింగ్ కాకపోయినా.. వస్తువు చివరిగా ఎక్కడ కనిపించిందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)