Breaking News

లోకల్‌ కంటెంట్‌పై ఫోకస్‌.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి

Published on Sun, 05/04/2025 - 12:45

డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, డిజిటల్ విస్తరణపై ఫోకస్‌గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. లోకల్‌ కంటెంట్‌కు ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.

వ్యూహాత్మక పెట్టుబడి

గత మూడేళ్లలో జియోస్టార్ రూ.85,000 కోట్లు వెచ్చించి ప్రముఖ మీడియా సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా రీజినల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్‌లో భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ దృష్టి సారించింది. ఐపీఎల్ సీజన్‌లో 300 మిలియన్ల సబ్‌స్రైబర్లను చేరుకోవడం, క్రికెట్ పట్ల దేశంలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమింగ్‌లో సాంకేతిక పురోగతిని పెంచడానికి పెద్దపీట వేస్తుంది.

ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ

స్థానిక కంటెంట్ విస్తరణ విభిన్న భాషా, సాంస్కృతిక ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో జియోస్టార్ హైపర్-లోకల్, ఇండియన్ సెంట్రిక్ కంటెంట్‌పై ఆసక్తిగా ఉంది. ఇందులో ప్రాంతీయ క్రీడలు, వినోదం కీలకంగా మారబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 5జీ, 4జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తున్నందున జియోస్టార్ తన డిజిటల్ పంపిణీ ఛానళ్లను బలోపేతం చేస్తోంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు లేదా ప్రత్యక్ష ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృత ప్రేక్షకులకు కంటెంట్‌ అందుబాటులో ఉండేలా చూస్తోంది.

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)