భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
అంతర్జాతీయంగా జియోహాట్‌స్టార్ విస్తరణ
Published on Wed, 09/02/2026 - 04:33
ముంబై: స్ట్రీమింగ్ సేవల దిగ్గజం జియోహాట్‌స్టార్ తమ కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. యునైటెడ్ కింగ్డం, కెనడా, సింగపూర్‌లో వీటిని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. జియోహాట్‌స్టార్‌లో 12 పైగా భాషల్లో 1,60,000 గంటల కంటెంట్ ఉన్నట్లు జియోస్టార్ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ అమిత్ మల్హోత్రా తెలిపారు. ఏటా 30,000 గంటల తాజా కంటెంట్‌ను జతపరుస్తున్నట్లు సంస్థ వివరించింది.
తొలిసారిగా ఈ మూడు మార్కెట్లలో త్రైమాసిక సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు జియోహాట్‌స్టార్ పేర్కొంది. క్వార్టర్లీ ప్లాన్లు సెపె్టంబర్ 2 నుంచి బ్రిటన్‌లో 19.99 పౌండ్లు, కెనడాలో 19.99 కెనడియన్ డాలర్లు, సింగపూర్‌లో 29.98 సింగపూర్ డాలర్లుగా ఉంటాయని వివరించింది.
#
Tags : 1