Breaking News

కొత్త ఫోన్‌ తీసుకొచ్చిన జియో.. ఇది ఉంటే ఫుల్‌ సేఫ్టీ!

Published on Thu, 10/09/2025 - 15:43

రిలయన్స్‌ జియో సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సులో వివిధ సేఫ్టీ ఫీచర్లతో కూడిన జియోభారత్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఫోన్ పర్యవేక్షణ, వినియోగ నిర్వహణ, కుటుంబ సభ్యులు, పిల్లలు, వృద్ధులకు సంబంధించిన హెల్త్‌ వంటి సేఫ్టీ-ఫస్ట్‌ ఫీచర్లను ఈ ఫోన్‌లో తీసుకొచ్చింది.

వినియోగదారులకు భద్రతతోపాటు పీస్‌ ఆఫ్‌ మైండ్‌ ఇచ్చేలా రూపొందించిన జియోభారత్‌ ఫోన్లను ఐఎంసీ సదస్సులో రిలయన్స్‌ ఆవిష్కరించింది. అంతేకాకుండా  వైట్-లిస్టింగ్ ద్వారా అవాంఛిత కాల్స్ , కాలర్లను నివారించడంలో సేఫ్టీ షీల్డ్‌ సహాయపడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన ఫీచర్‌ ఏంటంటే కుటుంబ సభ్యుల వద్ద ఉన్న జియోఫోన్‌లో బ్యాటరీ , నెట్ వర్క్ లభ్యత స్థితిని రిమోట్ గా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఇక ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్ ఏడు రోజుల వరకు ఉంటుందని జియో పేర్కొంది.

జియోభారత్‌ ఫోన్‌ సేఫ్టీ షీల్డ్‌ మరిన్ని ప్రయోజనాలను రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ వివరించారు. ఈ ఫోన్‌లు ముఖ్యంగా కుటుంబంలోని పిల్లలు, పెద్దవారి కోసం రూపొందించినట్లు చెప్పారు. ఈ ఫోన్‌లు వినియోగిస్తున్న తమ వారు ఎక్కడ ఉన్నారు.. వారి ఫోన్‌లు ఎక్కడ ఉన్నాయో మీరు పర్యవేక్షించగలుగుతారు. ఒకవేళ కనిపించక పోయినట్లయితే ఫోన్‌లోని అలారాన్ని మోగి​ంచవచ్చు.

జియోభారత్‌ ఫోన్‌లను జియో స్టోర్స్, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలుచ చేయవచ్చు. జియోభారత్‌ ఫోన్ల ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)