Breaking News

జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్

Published on Fri, 10/25/2024 - 18:32

ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి.  రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్‌లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్‌లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.

ప్రయోజనాలు
ఈజీ మై ట్రిప్‌ వోచర్‌: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్‌ వోచర్‌ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.
అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.
స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.

ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గం

కూపన్స్ ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలంటే..
రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్‌ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి
➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి
➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)