బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
జియో రీచార్జ్: ఫ్యామిలీ ప్లాన్.. 4 సిమ్‌లకు అన్లిమిటెడ్!
Published on Wed, 09/09/2026 - 21:21
డబ్బులన్నీ ఫోన్ రీచార్జ్లకే అయిపోతున్నాయి.. ఇది ప్రతి కుంటుంబంలో వినిపించే మాటే. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ కుటుంబంలోని ప్రతి సభ్యుడి మొబైల్‌కు ప్రత్యేకంగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో నెలవారీ మొబైల్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఫ్యామిలీల కోసం ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. జియోప్లస్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కేటగిరీలోని రూ.449 ప్లాన్ ద్వారా ఒకే కనెక్షన్ కింద గరిష్ఠంగా నలుగురు కుటుంబ సభ్యుల సిమ్‌లను నిర్వహించుకోవచ్చు.
రూ.449 ప్లాన్‌తో నాలుగు నంబర్లు
ఈ ప్లాన్‌లో ప్రైమరీ సిమ్‌కు నెలకు రూ.449 చెల్లించాలి. దీనికి కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవాలంటే ఒక్కో అదనపు సిమ్‌కు నెలకు రూ.150 చొప్పున చెల్లించాలి. గరిష్ఠంగా మూడు అదనపు సిమ్‌లను జోడించవచ్చు. అంటే నాలుగు సిమ్‌లను కలిపి వినియోగిస్తే నెలవారీ ఖర్చు రూ.899 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో సిమ్‌కు నెలకు సగటున రూ.225 మాత్రమే ఖర్చవుతుంది.
90GB వరకు షేరింగ్ డేటా
డేటా ప్రయోజనాల విషయానికి వస్తే, ప్రైమరీ కనెక్షన్‌కు 75GB షేరింగ్ డేటా లభిస్తుంది. అదనంగా జోడించే ప్రతి సిమ్‌కు ఫ్యామిలీ డేటా పూల్‌లో మరో 5GB డేటా చేరుతుంది. మూడు అదనపు సిమ్‌లను జోడిస్తే 15GB అదనపు డేటా లభిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఉపయోగించుకునే మొత్తం డేటా 90GBకి చేరుతుంది. అంతేకాకుండా అర్హత ఉన్న ప్రాంతాలు, ఫోన్లలో జియో ట్రూలీ అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం కూడా అందిస్తుంది. కుటుంబ సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా షేరింగ్ డేటాను వినియోగించుకోవచ్చు.
అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత రోమింగ్
డేటాతో పాటు ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నాలుగు సిమ్ల వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాప్తంగా నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రతి సిమ్‌కు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. కుటుంబంలోని నలుగురు సభ్యులకు విడివిడిగా ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు చేయడం కంటే ఒకే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లో సిమ్‌లను నిర్వహించుకోవడం కొందరు వినియోగదారులకు సౌకర్యవంతమైన, ఖర్చు తగ్గించుకునే ప్రత్యామ్నాయంగా మారవచ్చు.
Tags : 1