జియో మరో సంచలనం.. ఇక టీవీనే కంప్యూటర్‌!

Published on Sat, 07/12/2025 - 21:30

ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగం మరో సంచలనంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో డిజిటల్ ఉపకరణాలు కోరుకునే వినియోగదారులకు జియో ప్లాట్‌ఫాంస్ జియో పీసీ (JioPC) పేరుతో కొత్త ఆవిష్కరణను తెచ్చింది. ఇది ఒక క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీసుగా పనిచేస్తూ మీ టీవీని పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చుతుంది.

ఈ ఏఐ (AI) ఆధారిత వర్చువల్ కంప్యూటింగ్ సర్వీస్‌ జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కీబోర్డ్, మౌస్‌ని ప్లగ్‌ఇన్ చేసి తమ టీవీలో డెస్క్‌టాప్ అనుభవాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్‌ చేయదు.

ధర, లభ్యత
జియోపీసీ ప్రస్తుతానికి ఉచిత ట్రయల్ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు అందిస్తోంది. పూర్తిగా పొందాలంటే రూ.5,499 చెల్లించి జియో బ్రాడ్‌బ్యాండ్‌తో పొందవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంటూ, కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటర్‌ను తీసుకొస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్ ఆకాశ్ అంబానీ గత మార్చిలోనే వెల్లడించారు.

ఫీచర్లు, వినియోగం ఇలా..
జియో వెబ్‌సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం.. లైబ్రేఆఫీస్‌ (LibreOffice) అనే మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ లాంటి ఓపెన్‌-సోర్స్‌ ఆఫీస్‌ సూట్‌ను దీంట్లో ప్రీఇన్‌స్టాల్‌ చేసిఉంటారు. దీని ద్వారా బ్రౌజింగ్ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ యాప్‌లను విడి బ్రౌజర్‌ ద్వరా ఉపయోగించవచ్చు. క్లౌడ్ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్‌ ఖర్చు కూడా ఏమీ ఉండదు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)