విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..
Breaking News
జియో లాభం జూమ్
Published on Sat, 10/31/2026 - 05:40
న్యూఢిల్లీ: దేశీ టెలికం, డిజిటల్ సేవల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్‌లాగే బంపర్ ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2026–27, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 13.7 శాతం జంప్ చేసి రూ. 8,389 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ. 7,379 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 11.4 శాతం వృద్ధితో రూ. 40,475 కోట్లకు చేరింది. కాగా, జియో స్టాక్ మార్కెట్ అరంగేట్రం తర్వాత ఇవి తొలి ఫలితాలు కావడం విశేషం. ఇష్యూ ధర రూ.1,119తో పోలిస్తే తాజాగా జియో 21.36 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద లిస్టయిన సంగతి తెలిసిందే.
దీంతో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ‘ఈ త్రైమాసిక ఫలితాలు మా 5జీ నెట్‌వర్క్ పటిష్టత, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ సరీ్వసుల వృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్స్, 6జీ మేధో సంపత్తి, ఏఐ సరీ్వసులతో మా వాటాదారులకు నిరంతర విలువను చేకూరుస్తాం. మార్కెట్ అనిశి్చతుల్లోనూ జియో బ్లాక్‌బస్టర్ ఐపీఓ అన్ని ఇన్వెస్టర్ విభాగాల వ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేసింది. గడిచిన పదేళ్లలో మేము సాధించినదానికి మించి రాబోయే దశాబ్దంలో మరింత విలువను సృష్టిస్తాం’ అని జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
ఏఆర్‌పీయూ దూకుడు...
జియో ప్లాట్‌ఫామ్స్ క్యూ2 ఎబిటా 16.6 శాతం జంప్ చేసి రూ.21,879 కోట్లకు చేరింది. కాగా, సెపె్టంబర్ చివరి నాటికి జియో యూజర్ల సంఖ్య 54.2 కోట్లకు చేరింది. 30 కోట్ల మంది 5జీ యూజర్ల మైలురాయిని అధిగమించింది. గత 12 నెలల్లో 6.6 కోట్ల మంది 5జీ యూజర్లు జతయ్యారు. ఫిక్సిడ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 3 కోట్లను అధిగమించగా, ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లు 1.51 కోట్లకు చేరాయి. జియో సగటు యూజర్ ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.218.8కి ఎగసింది. గతేడాది క్యూ2లో ఇది రూ.211.4గా ఉంది. జియో స్టార్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.6,806 కోట్లుగా నమోదైంది. సగటు నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 10 శాతం ఎగసి దాదాపు 44 కోట్లను తాకింది. కాగా, ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా వినియోగం 14.2 శాతం పెరుగుదలతో 44.2 జీబీకి చేరింది.
జియో షేరు ధర శుక్రవారం 0.68% లాభంతో రూ. 4,131 వద్ద క్లోజైంది. మార్కెట్ విలువ రూ.13.18 లక్షల కోట్లకు చేరింది. ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వచ్చాయి.
Tags : 1