Breaking News

శుభవార్త..దేశంలో జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు..ఎలా పనిచేస్తుందంటే?

Published on Tue, 04/25/2023 - 15:53

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో త్వరలో జియో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ ఎయిర్‌ఫైబర్‌ గురించి 2022లో జరిగిన 45వ రిలయన్స్​ ఏజీఎం (వార్షిక సర్వసభ్య సమావేశం) లో దీనిపై ప్రకటన చేసింది. కానీ విడుదల, ధర ఇతర విషయాల్ని వెల్లడించలేదు.  

ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL) ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ జియో ఫైబర్‌ లాంఛింగ్‌పై స్పందించారు. మరికొద్ది నెలల్లో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫిక్స్‌డ్‌ లైన్‌ ఇంటర్నెట్‌ సర్వీసుల్ని అందించే ఎయిర్‌ టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌,యాక్ట్‌ వంటి సంస్థలకు జియో గట్టిపోటీ ఇవ్వనుంది. 
 


జియో ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్‌, హాట్‌స్పాట్‌ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ను ఆఫ్‌, ఆన్‌ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్‌ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్‌) స్పీడ్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. 

జియో ఏం చెబుతోంది!
సాధారణంగా బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్‌ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్‌ డివైజ్‌. దగ్గర్లోని జియో టవర్స్‌ నుంచి వీటికి సిగ్నల్స్‌ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్‌ గురించి జియో వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్‌, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్‌ చేయొచ్చు. సంబంధిత వెబ్‌సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్‌ అవసరం లేకుండా బ్లాక్‌ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్‌ స్పీడ్‌ పొందవచ్చని తెలిపింది. 

జియో ఎయిర్‌ఫైబర్‌ ధర ఎంతంటే? 
జియో 2022 అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్‌ డివైజ్‌ గురించి ప్రస్తావించింది.  జియో అధికారికంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్‌) రూ. 2,800కి, మెష్ ఎక్స్‌టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్‌టెండర్‌ 6 మెష్‌ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్‌లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)