Breaking News

జియో పేమెంట్స్ బ్యాంక్ వినూత్న అకౌంట్‌

Published on Mon, 09/22/2025 - 13:47

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (Jio Payments Bank)  'సేవింగ్స్ ప్రో' పేరుతో సరికొత్త సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ఖాతాలోని నిధులు ఊరికే పడిఉండకుండా ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్ 'గ్రోత్' ప్లాన్లలో ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ఈ అకౌంట్‌ వినూత్న ప్రత్యేకత.

ఇప్పటికే జియో పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉన్న ఖాతాదారులు కేవలం కొన్ని క్లిక్‌లతో తమ ఖాతాను సేవింగ్స్ ప్రో (Savings Pro) ఖాతాకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆటో-ఇన్వెస్ట్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..
» ఖాతాదారులు తమ అకౌంట్‌లో బ్యాలెన్స్‌కు ఒక పరిమితిని నిర్ణయించుకుంటారు. ఇది కనీసం రూ .5,000 ఉంటుంది.

» ఈ పరిమితి కంటే ఎక్కువగా ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా అది తక్కువ రిస్క్‌ ఉండే ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఆటోమేటిక్‌గా వెళ్తుంది.

» ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు రోజుకు రూ .1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సెబీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిడంప్షన్లు ప్రాసెస్ చేస్తారు.

» కస్టమర్లు తమ పెట్టుబడులలో 90 శాతం వరకు తక్షణమే రీడీమ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. గరిష్టంగా తక్షణ రిడంప్షన్ పరిమితి రూ .50,000. దీని కంటే ఎక్కువ కావాలంటే 1 నుంచి 2 పనిదినాల్లోగా రీడిమ్ చేసుకోవచ్చు.

» ఈ మొత్తం ప్రక్రియంతా జియో ఫైనాన్స్ యాప్ ద్వారా ఇటువంటి ఇబ​ందులు లేకుండా పూర్తిగా డిజిటల్‌గా జరుగుతుంది.

» ఎంట్రీ లేదా ఎగ్జిట్‌ లోడ్లు, హిడెన్‌ ఛార్జీలు లేదా లాక్-ఇన్ పీరియడ్‌ వంటివేవీ ఉండవు. 

ఇదీ చదవండి: అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)