తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
జియో యూజర్లకు శుభవార్త: రూ.100 రీఛార్జ్‌తో ఎన్నో బెనిఫిట్స్!
Published on Sat, 05/17/2025 - 15:50
భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులతో అగ్రగామిగా ఉన్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ 'జియో'.. రూ.100 ప్లాన్‌లో రూ.299 విలువైన ఓటీటీ బెనిఫిట్స్ అందించే ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారుల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రూ.100 ప్లాన్
జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 ప్లాన్.. సాధారణంగా రూ.299 ప్లాన్‌లో కనిపించే ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం డేటా 5 జీబీ మాత్రమే. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లపై ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటి వాటిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.
బేస్ ప్లాన్ రీఛార్జ్ తప్పనిసరి
జియో వినియోగదారులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. 100 రూపాయల ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే.. జియో నంబర్‌లో యాక్టివ్ బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాల్సిందే. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోకుండా.. రూ. 100 రీఛార్జ్ ద్వారా ప్రయోజనాలను పొందలేరు.
Tags : 1