Breaking News

జియో కొత్త ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ

Published on Mon, 01/27/2025 - 17:05

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. కొన్ని రోజులకు ముందు ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసమే రీఛార్జ్ చేసుకునేవారి కోసం రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. దీంతో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటి గురించి తెలుసుకుందాం.

జియో ప్రవేశపట్టిన కొత్త ప్లాన్‌ల జాబితాలో 84 రోజుల ప్లాన్, 365 రోజుల ప్లాన్ ఉన్నాయి. వీటి రీఛార్జ్‌తో యూజర్ కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటివి మాత్రమే చేసుకోవచ్చు, డేటా లభించదు. ఇవి కీ ప్యాడ్ మొబైల్ లేదా.. డేటా అవసరం లేని మొబైల్స్ ఉపయోగిస్తున్నవారికి మంచి ఆప్షన్.

రూ.458 : 84 రోజులు
జియో యూజర్లు రూ. 458తో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందుతారు. అంతే కాకుండా వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.

రూ.1,958 : 365 రోజులు
జియో అందిస్తున్న మరో ప్లాన్ ధర రూ. 1,958. ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ పొందుతుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. 3,600 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందుతారు. జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.

జియో రెండు ప్లాన్‌లను తొలగించింది
జియో ఇప్పుడు తన జాబితా నుంచి రెండు పాత రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించింది. అవి రూ. 479 ప్లాన్, రూ. 1899 ప్లాన్. 1899 రూపాయల ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటాను అందించగా, రూ. 479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటాను అందించింది. ఇప్పుడు ఇవి రెండూ అందుబాటులో లేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)