Breaking News

జియో భారత్‌ ఫోన్లలో కొత్త ఫీచర్‌.. ‘జియో సౌండ్‌ పే’

Published on Fri, 01/24/2025 - 22:19

దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 5 కోట్ల మంది చిరు వ్యాపారుల కోసం రిలయన్స్‌ జియో (Reliance jio) కీలక నిర్ణయం తీసుకుంది. జియో భారత్‌ ఫోన్లలో (Jio Bharat Phone) ‘జియో సౌండ్‌ పే’ (Jio Sound Pay) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఫీచర్‌తో జియో భారత్‌ వినియోగదారులు ప్రతి యూపీఐ పేమెంట్‌కి తాము ఎంపిక చేసుకున్న భాషలో కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ ఉచితంగా వినొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటూ ప్రతి భారతీయుడి సాధికారతే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో ఇన్ఫోకామ్‌ లిమిటెట్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ దత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కిరాణా షాప్‌లు, టీ దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు తదితర చిన్న తరహా వ్యాపారాలు చేస్తున్న వారంతా పేమెంట్‌ కన్ఫర్మేషన్‌ కోసం సౌండ్‌ బాక్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని కోసం ప్రతి నెలా రూ.125 చెల్లిస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన ‘జియో సౌండ్‌ పే’ ఫీచర్‌తో ఎలాంటి సౌండ్‌ బాక్సులు అవసరం లేకుండానే ఫోన్‌లోనే కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వినొచ్చు. దీనివల్ల వ్యాపారులకు ఏడాదికి రూ.1500 వరకు ఆదా అవుతుందని జియో ప్రకటనలో వెల్లడించింది.

భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోసౌండ్‌పేలో "వందేమాతరం" ఆధునిక సంస్కరణలను కూడా ప్రారంభించింది. ఈ ఆత్మీయ నివాళి సమకాలీన సంగీత అంశాలతో క్లాసిక్ మెలోడీలను మిళితం చేస్తుంది. వినియోగదారులు తమ దినచర్యకు దేశభక్తిని జోడించి మైజియో యాప్ లేదా జియో సావన్‌ ద్వారా ఈ రెండిషన్‌లను వారి జియోట్యూన్‌లుగా సెట్ చేసుకోవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)