జియో స్పీడ్‌ ఎక్కువే: ఓపెన్‌ సిగ్నల్‌!

Published on Fri, 10/18/2024 - 10:34

వేగంగా నెట్‌వర్క్‌ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్‌వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్‌ సిగ్నల్‌ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ నెట్‌వర్క్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్‌’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్‌వర్క్‌ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.

నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్‌ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్ స్పీడ్ కలిగిన నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ 44.2 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ ఐడియా 16.9 ఎంబీపీఎస్‌తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్‌వర్క్‌ స్పీడ్‌ ఎయిర్‌టెల్‌ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్‌వర్క్‌ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి.  

ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..

దేశీయంగా టెలికాం నెట్‌వర్క్‌ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్‌లు, వీడియో స్ట్రీమింగ్‌, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్‌వర్క్‌ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్‌ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అ‍ట్రిషన్‌ రేటు(నెట్‌వర్క్‌ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్‌ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్‌వర్క్‌ స్పీడ్‌ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి  క్రమంగా నెట్‌వర్క్‌ స్పీడ్‌ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
 

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)