Breaking News

జియో కొత్త ఆఫర్‌.. 18 నెలలు ఉచితం!

Published on Thu, 11/20/2025 - 14:14

ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు తన అపరిమిత 5జీ వినియోగదారులందరికీ జెమిని ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తోంది. ఇంకా ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3 మోడల్ కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. గూగుల్ ఇటీవలే తన సరికొత్త,  అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడల్.. జెమిని 3ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి జెమిని కంటే మెరుగ్గా ఉందని, ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ-5.1ను అధిగమిస్తుందని గూగుల్ పేర్కొంది.

రూ.35,100 విలువైన జెమినీ ప్రో ప్లాన్ ను జియో యూజర్లు ఉచితంగా పొందవచ్చు. గతంలో గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వియో 3.1 మోడళ్లతో ఫొటోలు, వీడియోలను సృష్టించడంలో పరిమితులు ఉండేవి. అయితే, ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. దీన్ని ఎలా పొందాలో చూద్దామా..?

18 నెలలపాటు ఉచితం
జియో అన్ లిమిటెడ్ 5G వినియోగదారులందరూ జెమిని ప్రో ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జెమిని ప్రో ప్లాన్‌కు  సాధారణంగా రూ .35,100 ఖర్చు అవుతుంది. అంటే వినియోగదారులు ప్లాన్ లో చేర్చిన అన్ని ప్రయోజనాలను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు.

ఈ జియో అప్ గ్రేడ్ ఆఫర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి వస్తుంది. గతంలో ఈ ఆఫర్ యువ కస్టమర్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ జియో దీన్ని ఇప్పుడు అపరిమిత 5G వినియోగదారులందరికీ విస్తరించింది.

ఆఫర్ ఎలా పొందాలంటే.. 
ఈ ఆఫర్ ను పొందడానికి ఫోన్ లో మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5జీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్న జియో నంబర్ తో లాగిన్ అవ్వాలి. అప్పుడు యాప్‌లో జెమిని ప్రో ప్లాన్ ఆఫర్‌కు సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ క్లెయిమ్ నౌ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆఫర్ ను పొందవచ్చు.

#

Tags : 1

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)