Breaking News

జియో.. జెరోధా.. ​కొత్త మ్యూచువల్‌ ఫండ్‌లు

Published on Mon, 03/23/2026 - 17:56

జెరోధా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్‌ 50:50 ఇండెక్స్‌ ఫండ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ ఫండ్‌ను కేదార్‌నాథ్‌ మిరాజ్‌కార్‌ నిర్వహించనున్నారు. ఈ ఫండ్‌ అధిక రిస్క్‌ కిందకు వస్తుంది.

నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్‌ 400 50:50 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.

జియో బ్లాక్‌రాక్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ 
జియో బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా జియో బ్లాక్‌రాక్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్‌ 7న ముగుస్తుంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్‌ఈ 100 ఇండెక్స్‌ (టీఆర్‌ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.

తన్వి కచేరియా, సాహిల్‌ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్‌ప్లాన్‌ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్‌ ఆప్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)