5జీ నెట్‌వర్క్‌లో నెంబర్ వన్: తెలుగు రాష్ట్రాల్లో జియో హవా..

Published on Fri, 10/18/2024 - 18:31

5జీ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో రిలయన్స్ జియో నెంబర్ వన్‌గా అవతరించింది. 5జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో మాత్రమే కాకుండా , లభ్యతలో కూడా జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) జియో అసాధారణమైన పనితీరును కనపరిచినట్లు వెల్లడించింది.

ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్‌వర్క్ లభ్యత స్కోర్‌తో దాని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.

5జీ కవరేజ్ ఎక్స్‌పీరియన్స్‌లో జియో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ముందుంది. 10 పాయింట్ల స్కేల్‌పై జియో 9.0 పాయింట్ల స్కోర్‌తో.. దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్‌టెల్ (7.1 స్కోర్) కంటే ముందు వరసలో ఉంది. జియో ఎప్పటికప్పుడు నిరంతరాయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతుండటంతో వినియోగదారులు ఈ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు.

జియో, ఎయిర్‌టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా 3.7 పాయింట్ల స్కోర్, బీఎస్ఎన్ఎల్ 1.2 పాయింట్ల స్కోర్స్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 5G కవరేజీని విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియాకు సవాలుగా మారింది. అయితే ప్రస్తుతం వినియోగదారులు జియో 5జీ ద్వారా స్పీడ్ డౌన్‌లోడ్‌ పొందుతూ మెరుగైన నెట్‌వర్క్ అనుభవం పొందుతున్నారని సమాచారం.

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)