Breaking News

అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు

Published on Wed, 04/30/2025 - 06:13

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజున (నేడు) దేశవ్యాప్తంగా రూ.16,000 కోట్ల విలువైన ఆభరణాల అమ్మకాలు నమోదు కావొచ్చని ఆల్‌ ఇండియా జ్యుయలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ అంచనా వేస్తోంది. ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లలో మిశ్రమ ధోరణి ఉంటుందని అఖిల భారత రిటైల్‌ వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష స్థాయిలో ఉండగా, వెండి ధర సైతం కిలోకి రూ.లక్ష సమీపంలో ఉండడం గమనార్హం. గతేడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగిపోవడం తెలిసిందే.

 ‘‘సాధారణంగా అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ధరలు పెరిగిపోవడం ఈ ఏడాది వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చు. అక్షయ తృతీయ రోజున 12 టన్నుల బంగారం (రూ.12,000 కోట్లు), 400 టన్నుల వెండి (రూ.4,000 కోట్లు) కలిపి మొత్తం మీద రూ.16,000 కోట్ల అమ్మకాలు ఉండొచ్చని అంచనా’’అని ఆల్‌ ఇండియా జ్యుయలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ అరోరా తెలిపారు. కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్‌ కొంత తగ్గొచ్చన్నారు.

అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులు పెరిగిపోవడం ధరల ర్యాలీకి కారణమని తెలిసిందే. ప్రస్తుతం వివాహాల సీజన్‌ నడుస్తుండడం జ్యుయలరీ డిమాండ్‌ పడిపోకుండా సాయపడుతున్నట్టు సీఏఐటీ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బీసీ భార్తియా తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు పెంచుకునేందుకు ప్రముఖ జ్యయలరీ సంస్థలు ధరలో, తయారీ చార్జీల్లో తగ్గింపును ఇప్పటికే ప్రకటించాయి. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)