Breaking News

ఆభరణాల డిమాండ్‌ ఎలా ఉందంటే..

Published on Sat, 12/23/2023 - 06:31

ముంబై: ధరలు పెరిగినప్పటికీ పసిడి ఆభరణాలకు డిమాండ్‌ తగ్గడం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. బంగారం  ఆభరణాల వినియోగం.. విలువ  పరంగా  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 10 నుంచి 12 శాతం పెరుగుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా– నివేదిక పేర్కొంది. ఇంతక్రితం వేసిన 8 నుంచి 10 శాతం అంచనాలను ఈ మేరకు ఎగువముఖంగా సవరించింది. పసిడి ధరల పెరుగుదలే దీనికి కారణమని వివరించింది.

2023–24 మొదటి ఆరునెలల కాలాన్ని (ఏప్రిల్‌–సెప్టెంబర్‌)  2022–23 ఇదే కాలంతో  పరిశీలిస్తే ఆభరణాల వినియోగం విలువ 15 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ’అక్షయ తృతీయ’ సమయంలో స్థిరమైన డిమాండ్, అధిక బంగారం ధరలు దీనికి కారణంగా పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఈ శాతం 6 నుంచి 8 శాతమే ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామీణ డిమాండ్‌ మందగమనం, ద్రవ్యోల్బణం తీవ్రత తమ అంచనాలకు కారణమని పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
     
► డిసెంబర్‌ 2022–ఏప్రిల్‌ 2023 మధ్య అస్థిరత కొనసాగిన బంగారం ధరలు, 2023–24 మొదటి అర్థభాగంలో (ఏప్రిల్‌–సెపె్టంబర్‌) స్థిరంగా ఉన్నాయి.  అయితే క్రితం సంవత్సరం సగటు ధరలతో పోలిస్తే 14 శాతం పెరిగాయి.  
► పెరిగిన ధరలు.. పలు ఆభరణాల రిటైలర్ల ఆదాయ పటిష్టతకు దోహదపడ్డాయి.  
► మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ స్థూల ఆర్థిక అనిశి్చత పరిస్థితులతో సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి.  
► అక్టోబర్‌ 2023 ప్రారంభం నుండి బంగారం ధరల పెరుగుదల, స్థిరంగా కొనసాగుతున్న  ద్రవ్యోల్బణం తీవ్రతవల్ల యల్లో మెటల్‌ ఆభరణాల డిమాండ్‌ కొంత తగ్గవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)