Breaking News

స్పందించిన బెజోస్.. రిప్లై ఇచ్చిన మస్క్: ట్వీట్స్ వైరల్

Published on Sat, 11/23/2024 - 17:41

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతారని ఊహించినందున.. తమ టెస్లా, స్పేస్‌ఎక్స్ స్టాక్‌లను విక్రయించమని అమెజాన్ వ్యవస్థాపకుడు ప్రజలకు సలహా ఇచ్చారని 'ఇలాన్ మస్క్' (Elon Musk) చేసిన వాదనపై జెఫ్ బెజోస్ స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మస్క్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, అది వంద శాతం తప్పు అని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. సరే, నేను సరిదిద్దుకున్నాను అంటూ.. మస్క్ స్మైల్ ఎమోజీని యాడ్ చేశారు.

అంతే కంటే ముందు నవంబర్ 6న జెఫ్ బెజోస్ తన ఎక్స్ ఖాతాలో డోనాల్డ్ ట్రంప్‌ను అభినందించారు. మా 47వ అధ్యక్షుడికి శుభాకాంక్షలు అంటూ.. మనమందరం ఇష్టపడే అమెరికాను నడిపించడంలో ట్రంప్‌ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జెఫ్ బెజోస్ కమలా హారిస్‌కు సపోర్ట్ చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

రూ.28 లక్షల కోట్లకు చేరిన మస్క్‌ సంపద
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్‌ విజయం తర్వాత టెస్లా స్టాక్‌ ఏకంగా 40 శాతం పెరిగింది. దీంతో మస్క్‌ సంపద ఏకంగా 70 బిలియన్‌ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌