Breaking News

ప్రియురాలితో బెజోస్ పెళ్లి.. ఖర్చు అన్ని వేలకొట్లా?

Published on Sun, 12/22/2024 - 16:41

అమెజాన్ ఫౌండర్, ప్రపంచ ధనవంతులలో రెండో వ్యక్తి 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు. ఈ పెళ్ళికి ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. కాగా 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఈమెకు బెజోస్ సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో జరగనున్న వీరి పెళ్ళికి.. పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం 2019లో నిజమని తెలిసింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 55 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంది. 60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య 'మెకంజీ స్కాట్‌'కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పెళ్లైంది. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్‌ ఐకాన్‌?

జెఫ్ బెజోస్ నికర విలువ
ప్రపంచ కుబేరుడైన ఇలాన్ మస్క్ తరువాత, రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ నికర విలువ 244 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు