Breaking News

అమెజాన్ ఫౌండర్ తల్లి కన్నుమూత: జెఫ్ బెజోస్ భావోద్వేగ పోస్ట్

Published on Fri, 08/15/2025 - 12:39

ప్రపంచ కుబేరులలో ఒకరు 'జెఫ్ బెజోస్' తల్లి 'జాక్లిన్ గిస్ బెజోస్' ఆగస్టు 14, 2025న మరణించారు. ఈ విషయాన్ని అమెజాన్ ఫౌండర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు.

జాక్లిన్ గిస్ బెజోస్ 78ఏళ్ల వయసులో లెవీ బాడీ డిమెన్షియాతో కన్నుమూశారు. ''లెవీ బాడీ డిమెన్షియా అనే మెదడు సంబంధిత వ్యాధితో సుదీర్ఘ పోరాటం తర్వాత, ఆమె ఈరోజు మరణించింది, ఆమెను ప్రేమించేవారు మనలో చాలామంది ఉన్నారు. నేను ఆమెను ఎప్పటికీ నా గుండెల్లో ఉంచుకుంటాను. ఐ లవ్ యూ అమ్మ'' అంటూ జెఫ్ బెజోస్ భావోద్వేగ పోస్ట్ చేశారు.

బెజోస్ భార్య లారెన్ సాంచెజ్ బెజోస్ ఆ పోస్ట్ కింద.. "మేము ఆమెను చాలా మిస్ అవుతాము, లవ్ యూ" అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజి యాడ్ చేశారు.

జాక్లిన్ బెజోస్ గురించి
డిసెంబర్ 29, 1946న వాషింగ్టన్, డీసీలో జన్మించిన జాక్లిన్.. న్యూ మెక్సికోలోని బెర్నాలి, అల్బుకెర్కీలలో పెరిగారు. చదువుకునే వయసులోనే 'టెడ్ జోర్గెన్సెన్'తో బిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి పాఠశాలలో చదువుతూ.. పగటిపూట పని చేస్తూ జెఫ్‌ను పెంచింది. అయితే వీరు విడిపోయారు. 1968లో, ఆమె క్యూబా వలసదారు మిగ్యుల్ “మైక్” బెజోస్‌ను వివాహం చేసుకుంది, అతను జెఫ్‌ను దత్తత తీసుకున్నాడు. ఆ తరువాత జాక్లిన్ & మైక్ జంటకు మార్క్ & క్రిస్టినా అనే పిల్లలు జన్మించారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)