Breaking News

60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్‌ ఫౌండర్‌

Published on Fri, 11/15/2024 - 15:39

ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లిచేసుకోనున్నట్లు తెలుస్తోంది.

2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం 2019లో బయటకు వచ్చింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 54 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఈమెకు సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం.

60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పెళ్లైంది. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.

జెఫ్ బెజోస్ నికర విలువ
ప్రపంచలోనే అత్యంత ధనవంతులైన.. టాప్ 10 కుబేరుల జాబితాలో ఒకరుగా నిలిచిన జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఈయన నికర విలువ 2024 నవంబర్ 13 నాటికి 230 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1,94,17,68,88,43,000.

#

Tags : 1

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)