Breaking News

జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్‌!

Published on Wed, 04/17/2024 - 16:31

తూర్పు ఆసియాలోని జపాన్‌కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్‌ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. 

జపాన్‌ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది.

సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్‌తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్‌, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్‌ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్‌  పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్‌ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు