Breaking News

50 కోట్ల మార్క్‌ను దాటిన జన్‌ధన్‌ యోజన

Published on Tue, 08/22/2023 - 03:54

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ప్రారంభించిన తొమ్మిదేళ్లలో ఈ మైలురాయి నమోదైంది. ఇందులో 56 శాతం ఖాతాలు మహిళల పేరిట ప్రారంభమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం జన్‌ధన్‌ ఖాతాల్లో 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి ఉన్నట్టు పేర్కొంది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.03 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను ఉచితంగా అందించినట్టు తెలిపింది.

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఒక్కో ఖాతాలో సగటు బ్యాలన్స్‌ రూ.4,076గా ఉందని.. 5.5 కోట్ల ఖాతాలు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు అందుకుంటున్నట్టు వెల్లడించింది. 2014 ఆగస్ట్‌ 28న ఈ పథకం ప్రారంభం కావడం గమనార్హం. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ నిర్వించాల్సిన అవసరం ఉండదు. రూ.2 లక్షల ప్రమాద మరణ బీమాతో కూడిన రూపే కార్డు ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, ఈ ఖాతా నుంచి రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసుకునే సదుపాయం కూడా ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)