Breaking News

హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ క్యాంపస్‌ ప్రారంభం

Published on Tue, 07/08/2025 - 11:18

గ్లోబల్ స్పోర్ట్స్, గేమింగ్ లీడర్‌గా ఉన్న ఎంటైన్ సంస్థకు చెందిన టెక్నాలజీ విభాగం ఐవీ అధికారికంగా ఎంటైన్ ఇండియాగా రీబ్రాండ్‌ అయి హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్త హైదరాబాద్ క్యాంపస్ ఎంటైన్ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుందని కంపెనీ పేర్కొంది.

ఈ సంస్థలో పని చేసేందుకు హైబ్రిడ్ రోల్స్‌లో 3,400 మంది హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు చోటు కల్పించేలా ఈ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ఫెసిలిటీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎంటైన్ హైదరాబాద్‌ క్యాంపస్‌ ద్వారా గ్లోబల్ టెక్ సేవల్లో 85% పైగా సర్వీసులు అందించడానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇందులో సేవలందించే అడ్వాన్స్‌డ్‌ డొమైన్‌లు కింది విధంగా ఉన్నాయి.

  • కృత్రిమ మేధ

  • ప్లాట్ ఫాం ఇంజినీరింగ్

  • రియల్ టైమ్ ట్రేడింగ్ సిస్టమ్స్

గ్లోబల్ సస్టెయినబిలిటీ లక్ష్యాలకు అనుగుణంగా హైదరాబాద్‌ క్యాంపస్‌లోని సదుపాయాలు..

  • స్మార్ట్ లైటింగ్ వ్యవస్థలు

  • ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లు

  • పర్యావరణహిత నిర్మాణ సామగ్రి

ఇదీ చదవండి: ట్రంప్‌ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపు

ఈ రీబ్రాండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఎంటైన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంతిల్ అన్బగన్ మాట్లాడుతూ..‘ఎంటైన్ ఇండియా ద్వారా హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ భవిష్యత్తును ఇక్కడి నుంచి శక్తివంతం చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. ఎంటైన్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సాటీ బెన్స్‌ మాట్లాడుతూ..‘తదుపరి తరం వినోద వేదికలను నిర్మించాలనే మా ఆశయానికి భారతదేశం కేంద్రబిందువుగా మారింది. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడం ఆ దిశగా కంపెనీ వేసిన సాహసోపేతమైన ముందడుగు’ అని అన్నారు.

#

Tags : 1

Videos

TV5, మహా న్యూస్, ఈనాడు.. పాత్రికేయ ముసుగులో పచ్చ వ్యభిచారం

వెల్ కమ్ హోమ్ శుక్లా..

మహిళవి అని చాలా ఓపిగ్గా ఉన్న.. హద్దులు దాటేశావు.. ప్రశాంతి రెడ్డికి నల్లపురెడ్డి వార్నింగ్

మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన మంజునాథ్

Anil Kumar: మేము CCTV ఫ్యూటేజీతో కేసు పెట్టి వారం రోజులు అయింది..

ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించిన బీసీ నేత మారేష్

గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద YSRCP నేతల ధర్నా

సుప్రీం కోర్టు చేసిన సూచనలను EC పరిగణనలోకి తీసుకోవాలి: రాఘవులు

కూటమి పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు: సజ్జల

తిరుపతి రైలులో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే

Photos

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)