Breaking News

ధార్మిక సంస్థలకు.. ఐటీఆర్‌ ఫారం-7

Published on Mon, 06/10/2024 - 11:24

ఐటీఆర్‌ ఫారం 7 గురించి చెప్పే కథ పెద్దగా ఉంటుంది. ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమైనదేనని చెప్పక తప్పదు. ఎవరెవరు ఈ ఫారం వేయొచ్చంటే..
– ధార్మిక సంస్థలు, మత ట్రస్టులు
– రాజకీయ పార్టీలు 
– సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సంస్థలు 
– యూనివర్సిటీలు, కాలేజీలు, సంస్థలు 
– ఖాదీ, గ్రామ పరిశ్రమ సంస్థలు 

పైన చెప్పిన అన్నింటికీ నిర్వచనాలు ఉన్నాయి. ఆ పరిధిలోకి వచ్చినవే ఫారం 7 వేయాలి. నిర్వచనం, పరిధి, కార్యకలాపాలు, ఆంక్షలు ఇలా కొన్ని విషయాలను చట్టంలో పొందుపర్చారు. ఇటువంటి సంస్థలు మినహాయింపు పొందాలంటే దీన్ని వినియోగించుకోవచ్చు. ఇటువంటి సంస్థలకు ఆదాయం ఉంటుంది. ఖర్చులు ఉంటాయి. నికర ఆదాయం పన్ను పరిమితిని దాటి ఉంటుంది. కానీ వారికి మినహాయింపు ఉంటుంది.

పన్ను చెల్లించనక్కర్లేదు. పూర్తిగా మినహాయింపు వెసులుబాటు ఉంటుంది (చట్టానికి లోబడి). వారే ఫారం 7 వేయాలి. మినహాయింపునకు అర్హత లేని వారు, మినహాయింపు వద్దనుకున్న సంస్థలు ఫారం 7 వేయనక్కర్లేదు. అటువంటి సంస్థలు ఫారం 5 వేయాల్సి ఉంటుంది. గతంలో చెప్పినట్లు ఫారం 5 వేయాలా లేక ఫారం 7 వేయాలా అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరం అయితే, వృత్తి నిపుణుల సలహా తీసుకోండి. ట్రస్ట్, సొసైటీ, కంపెనీ, భాగస్వామ్య సంస్థ, స్థానిక సంస్థల, వ్యక్తుల కలయిక.. వీరందరూ కూడా ఈ రిటర్ను వేయొచ్చు.

అయితే, ఫారం 3,4,5,6లకు .. ఈ ఫారం 7కు తేడా ఏమిటీ అంటే దీన్ని వేయాల్సిన వారు మినహాయింపు కోవకు చెందినవారై ఉండాలి. మినహాయింపునకు అర్హత ఉన్నవారే దాఖలు చేయాలి. ఆడిట్‌కి వర్తించే కేసులైతే, 31–10–2024 లోపల వేయాలి. వీరు ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్టును కూడా నిర్దేశించిన ఫారంలో దాఖలు చేయాలి. ఇతరులు 31–07–2024 లోపల వేయాలి.

ఏ చిన్న తప్పు దొర్లినా, భూతద్దంలో చూస్తారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు కొన్ని సంస్థలు అర్హత లేకపోయినా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందుతున్నాయి. మీరు ట్రస్టీలైనా, మేనేజ్‌మెంట్‌ మెంబర్లయినా తగిన జాగ్రత్తలు వహించండి. 

– కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులు

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)