Breaking News

6.50 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు

Published on Tue, 08/01/2023 - 03:42

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు అయిన సోమవారం పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చారు. సోమవారం ఒక్కరోజే 36.91 లక్షల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి దాఖలైన మొత్తం రిటర్నుల సంఖ్య 6.50 కోట్లకు చేరింది. వేతన జీవులు, ఆడిటింగ్‌ అవసరం లేని వారు రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ కావడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి దాఖలైన 5.83 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 15 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

‘‘ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇందులో 36.91 లక్షల ఐటీఆర్‌లు 31వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు నమోదయ్యాయి’’అంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్‌ చేసింది.పన్ను ఎగవేతకు రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు, నిబంధనలను అనుసరించే వారు పెరగడంతో పన్ను చెల్లింపుదారుల బేస్‌ విస్తృతం అవుతున్నట్టు పన్ను నిపుణులు అభిప్రా యపడుతున్నారు. డేటా అనలైటిక్స్, ఇతర సమాచారం ఆధారంగా అధిక రిస్క్‌ కేసులను ఆదాయపన్ను శాఖ గుర్తించి, వారికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు చేపడుతుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. నగదు డిపాజిట్లు, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, ప్రాపర్టీల కొనుగోలు, విక్రయాలు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో లావాదేవీల సమాచారాన్ని ఆదాయపన్ను శాఖ సమీకరించి, విశ్లేíÙస్తున్నట్టు చెప్పారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)