Breaking News

ఐటీఆర్‌ దాఖలుకు మరొక రోజు గడువు 

Published on Tue, 09/16/2025 - 06:01

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) దాఖలుకు చివరి రోజు (సెపె్టంబర్‌ 15) అయిన సోమవారం ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌పై భారీ రద్దీ కనిపించింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై సోషల్‌ మీడియాలో ఎకరవు పెడుతూ, గడువు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. తొలుత ఎలాంటి సమస్యల్లేవన్న ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ).. సెపె్టంబర్‌ 16వ తేదీ వరకు (మరొక రోజు) గడువు పొడిగిస్తున్నట్టు రాత్రి 11 గంటల తర్వాత ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. ఐటీ పోర్టల్‌లో సమస్యలు ఎదురవుతున్నట్టు గత కొన్ని రోజులుగా వ్యక్తులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు సోషల్‌ మీడియా ద్వారా ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. పన్ను చెల్లింపులు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌) డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొంటూ, గడువు పొడిగించాలని కోరారు. ముఖ్యంగా ఇ–ఫైలింగ్‌ పోర్టల్‌పై లాగిన్‌ కాలేకపోయామంటూ పలువురు అసహనం వ్యక్తం చేయడం కనిపించింది.  

పెద్ద సంఖ్యలో రిటర్నులు..
7 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్టు సీబీడీటీ ప్రకటించింది. 2025–26 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి (2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఇంకా రిటర్నులు దాఖలు చేయని వారు వెంటనే ఆ పని పూర్తి చేయాలని సూచించింది. గత ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) రిటర్నుల సమర్పణకు జూలై 31 గడువు తేదీ కాగా, దీన్ని సెపె్టంబర్‌ 15 వరకు పొడిగించడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)