Breaking News

ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు

Published on Fri, 09/12/2025 - 17:49

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ) కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఆర్‌ దాఖలుకు గడువు సెప్టెంబర్‌ 15న ముగియనుంది.

పొడిగింపు కోరడానికి కారణాలు

  • ఐటీఆర్-5, ఆడిట్ సంబంధిత ఫారాలతో సహా ఐటీఆర్ ఫారాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.

  • ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్‌లోడ్‌ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్‌లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు.

  • ఒడిశాలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయానికి అంతరాయం కలిగించాయి. దీంతో సకాలంలో ఐటీఆర్‌ దాఖలు చేయడం కష్టతరం చేసింది.

  • మరోవైపు పండుగ సీజన్ పరిమితులు.గణేష్ పూజ, దుర్గా పూజ, దసరా వంటి ప్రధాన సెలవుదినాలు సిబ్బంది లభ్యతను పరిమితం చేశాయి.

  • ఐసీఏఐ కొత్త ఫార్మాట్ల కారణంగా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ల తయారీకి అదనపు సమయం అవసరమవుతోంది.

  • ఏకకాలంలో ఏకకాలంలో జీఎస్టీ ఫైలింగ్స్, ఐటీఆర్‌ ఫైలింగ్‌ పన్ను నిపుణుల పనిభారాన్ని పెంచుతోంది.

ప్రతిపాదిత పొడిగింపులు
ఐటీఆర్‌ (నాన్-ఆడిట్) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా సెప్టెంబర్ 30 వరకు పొడింగించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ (TAR) గడువు సెప్టెంబర్ 30 ఉండగా అక్టోబర్ 31 వరకు, టీఏఆర్ తో ఐటీఆర్ ఫైలింగ్‌కు అక్టోబర్ 31 చివరి తేదీ కాగా నవంబర్ 30 పొడిగించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు గడువును కూడా డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి.

విస్తృత మద్దతు 
కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), అడ్వకేట్స్ టాక్స్ బార్ అసోసియేషన్ (ATBA), ఐసీఏఐకి సంబంధించిన సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (CIRC) వంటి పన్ను నిపుణుల సంఘాలు కూడా గడువు పొడిగింపును కోరుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు అధికారిక నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)