Breaking News

ఐటీఆర్‌ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు

Published on Mon, 06/09/2025 - 10:13

అందరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి అన్ని రకాలుగా సన్నద్ధులైన వేళ.. గవర్నమెంటు వారు రాతపూర్వకంగా గడువుతేదీని పొడిగించినట్లు సెలవిచ్చారు. ట్యాక్స్‌ ఆడిట్‌ కాని అన్ని కేసులకు గడువు తేదీ 2025 జులై 31. అన్ని ఫారాలను వరుసగా నోటిఫై చేశారు. నోటిఫై చేసిన తర్వాత తీరా రిటర్న్‌ ఫైల్‌ చేద్దామని వెళితే.. అంతా రెడీగా లేదు. అందరి ఉత్సాహం నీరుకారింది. అటు అసెస్సీలకు, ఇటు వృత్తి నిపుణులకు అసహనం, అనుమానం రెండూ ఏర్పడ్డాయి. అంతలోనే ఈ పొడిగింపు వార్త వచ్చింది. ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకు పొడిగించారంటే..

1. ఫారాలు నోటిఫై చేశారు కానీ అప్‌డేటెడ్‌ ఫారాలు చాలా లేటుగా వచ్చాయి.  
2. ఫైలింగ్‌ చేయడానికి ఉండే యుటిలిటీలు రెడీగా లేవు.
3. ఇక్కడ చేయవలసింది పొడిగింపు కాదు. ఈ చర్య అనివార్యం కాదు. దానికి బదులుగా యుటిలిటీలను రెడీ చేయాల్సింది.  

ఎన్నో విషయాలు చకచకా చేసే ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబించిందో అంతుపట్టడం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి పొడిగింపు ఇవ్వకుండా/లేకుండా ఒక నిశ్చితమైన, నిర్దిష్టమైన వైఖరితో ఉంటూ ప్రభుత్వం ఒక మంచి సంప్రదాయాన్ని సృష్టించింది. అందరూ ఈ వైఖరిని మొదట్లో మెచ్చుకోక పోయినా, తర్వాత సర్దుకుని సద్దుమణిగారు. ఒక ముఖ్యమైన పని సకాలంలో జరిగిపోతుంది కదా అని సరదాపడ్డారు.  

యుటిలిటీని ఎనేబుల్‌ చేసి, అసెస్సీలను ఆకట్టుకుంటే ఎంతో బాగుండేది. ఒక సత్సంప్రదాయాన్ని మూడోసారి ముచ్చటగా కొనసాగించిన ఘనత దక్కించుకునే పరిస్థితుల్లో.. ఏకంగా 45 రోజులు పొడిగించారు. కొంత మంది సంతోషపడ్డారు. మరికొందరు సంబరపడ్డారు.  
కానీ పొడిగింపు అనేది పరిష్కారం కాదు. పని అలస్యం అవుతుందే తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు. పొడిగింపు అనగానే అందరు అసెస్సీలు ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుని పోస్ట్‌పోన్‌ చేస్తారు. ఆటోమేటిక్‌గా అన్నీ పోస్ట్‌పోన్‌ అయిపోతాయి. గత రెండు నెలల్లో చేయలేని యుటిలిటీలను ఎప్పుడు రెడీ చేస్తారు? ఎన్ని రోజుల్లో రెడీ చేస్తారు? డెవలప్‌మెంట్‌కి, ఇంటిగ్రేషన్‌కి, టెస్టింగ్‌కి వ్యవధి కావాలని సెంట్రల్‌ బోర్డ్‌ చెప్తోంది. అంటే వారికి నిర్దిష్టమైన ప్లాన్‌ ఉన్నా ఎప్పుడు రెడీగా ఉంటారో తెలియదన్నమాట.

సాధారణంగా మే 31 తర్వాత టీడీఎస్‌ స్టేట్‌మెంట్లలో అన్ని పద్దులు కనిపిస్తాయి. అవి ఆలస్యం అవుతాయి. ఒకవేళ కనిపించినా, సిస్టమ్స్‌ రెడీగా లేవు. ఇంకో సమస్య ఏమిటంటే, ట్యాక్స్‌ ఆడిట్‌కి గడువు తేదీ 2025 సెప్టెంబర్‌ 30. ఈ గడువు తేదీని కూడా పొడిగిస్తారా అనేదానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వృత్తి నిపుణులు జులై 31 తర్వాత ట్యాక్స్‌ ఆడిట్‌ కేసులను చేపడతారు. ఇప్పుడు రెండు గడువు తేదీలకు పదిహేను రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీని వల్ల పని ఒత్తిడి. మానసిక ఒత్తిడి. టైం చాలకపోవడం.. తప్పులు దొర్లే అవకాశం.. ఇలా ఎన్నో ఉన్నాయి.

ఇదీ చదవండి: సెబీ పేరుతో మోసాలు

ట్యాక్స్‌ ఆడిట్‌ కేసుల విషయంలో పొడిగింపు లేదు. విద్యార్థులు పరీక్షలు నిర్వహించే తేదీ పొడిగించగానే ముందు సంతోషిస్తారు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. నిజానికి ఆ పొడిగింపు వల్ల వారి శ్రమ రెట్టింపైందని. ఈ పొడిగింపు కూడా అలాంటిదే. గడిచిన సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఎంత కాలం సేకరిస్తూ కూర్చుంటారు. తినగ తినగ వేము తియ్యనుండులాగా ఇదేమీ పరిపక్వతకు సంబంధించిన విషయం కాదు. నైపుణ్యాలు, నాణ్యత పెరగవు. కానీ మీరు మాత్రం రెడీగా ఉండక తప్పదు. యుటిలిటీలు రెడీ కాగానే ఫైల్‌ చేయండి. వారు అడుతున్న సమాచారం మీ చేతిలో ఉందని బలమైన నమ్మకంతో ఉండండి.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు