Breaking News

భారీగా పెరిగిన ఐటీసీ చైర్మన్ వేతనం - ఎన్ని కొట్లో తెలుసా..?

Published on Tue, 07/11/2023 - 21:06

ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'సంజీవ్ పూరి' (Sanjiv Puri) 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న వేతనం ఏకంగా రూ. 16.31 కోట్లకు చేరింది. గతంలో ఆయన తీసుకున్న వేతనంతో పోలిస్తే ఇది 29.5 శాతం ఎక్కువ కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సంజీవ్ పూరి గత ఏడాది తీసుకున్న వేతనం 12.59 కోట్లు. దీన్ని బట్టి చూస్తే గత సంవత్సరం కంటే ఈ ఏడాది నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెరిగిందని స్పష్టమవుతోంది. ఈయన బేసిక్ శాలరీ రూ. 2.88 కోట్లు, పెర్ఫామెన్స్‌ బోనస్‌ అండ్ కమిషన్‌ రూపంలో రూ.12.86 కోట్లు అందుకున్నట్లు సమాచారం. వీటితో పాటు పెరిక్విసైట్స్, ఇతర ప్రయోజనాలు రూ. 57.38 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

నిజానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పదవి 2023 జులై 21 నాటికి ముగుస్తుంది. అయితే కంపెనీ బోర్డు పదవీ కాలాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది. గత సంవత్సరం ఆర్థిక మాంద్యం, అమ్మకాలు తగ్గడం, ధరల పెరుగుదల సమయంలో చాలా కంపెనీల అధినేతలు తమ శాలరీలు తగ్గించుకున్నారు. అయితే సంజీవ్ పూరి మాత్రం తన జీతం భారీగా పెంచుకున్నాడు.

(ఇదీ చదవండి: ఉద్యోగులకు మళ్ళీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఈ సారి ఎంతమందంటే?)

నివేదికల ప్రకారం, నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ 2022 లో తన వేతనంలో 6 శాతం తగ్గించుకున్నారు. ఈ కారణంగా రూ. 18.8 కోట్లుగా ఉన్న ఆయన వేతనం రూ. 17.7 కోట్లకు చేరింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)